24.1 C
Hyderabad
Friday, June 27, 2025
spot_img

Bhuvanagiri Hospital: శవాన్ని కొరుక్కుతిన్న ఎలుకలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీలో దారుణ ఘటన వెలుగు చూసింది. మార్చురీలోని ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబంతో సహా 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. అనంతరం కొంతకాలానికి రవికుమార్‌ భార్య మృతి చెందింది. కొన్నాళ్లకు రెండో వివాహం చేసుకోగా వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఐతే రెండో భార్య ఏడాది క్రితం రవికుమార్‌ను వదిలి వెళ్లింది. దీంతో రవికుమార్‌ తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ప్రగతినగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

 

డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రవికుమార్‌ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటి కొచ్చిన అతను తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న రవి కుమార్ పోరు పడలేక అతని తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. రాత్రి 11:30 నిమిషాల ప్రాంతంలో ఇంటికి తిరిగొచ్చే సరికి రవికుమార్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా మృతదేహాన్ని బయటే భద్రపరిచారు.

 

ఈ క్రమంలో రవికుమార్‌ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. ఐతే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మరోవైపు మృత దేహాన్ని ఎలుకలు కొరికి తిన్నట్లు జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చిన్నానాయక్‌ పేర్కొనడం గమనార్హం.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్