24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

‘భరతనాట్యం’ మెప్పించిందా? లేదా?

నటీనటులు: సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, గంగవ్వ, సలీం ఫేకు, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేశ్, సత్తన్న, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ తదితరులు
డైరెక్టర్: కేవీఆర్ మహేంద్ర
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్. శాకమూరి
నిర్మాత: పాయల్ సరాఫ్
నిర్మాణ సంస్థ: పీఆర్ ఫిల్మ్స్
విడుదల తేదీ: ఏప్రిల్-5

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ కూతురు శివాత్మికలను పరిచయం చేస్తూ ‘దొరసాని’ లాంటి పీరియాడికల్ లవ్ స్టోరీతో మంచి విజయం సాధించిన డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర తాజాగా తన రెండో సినిమా ‘భరతనాట్యం’తో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన నటీనటులు సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా లేడీ నిర్మాత పాయల్ సరాఫ్ నిర్మాణంలో తెరకెక్కిన ‘భరతనాట్యం’ సినిమాలో వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్ లాంటి స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘దొరసాని’తో హిట్ అందుకున్న కేవీఆర్ మహేంద్ర.. ఈసారి ‘భరతనాట్యం’తో ఎలాంటి ఫలితాన్ని అందుకోనున్నాడో తెలుసుకుందాం..

కథ:

రాజు సుందరం(సూర్యతేజ) సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి ఇంట్లో కష్టాలు, తన గర్ల్ ఫ్రెండ్(మీనాక్షి గోస్వామి) ఇంట్లో ఒప్పించడానికి.. వీటన్నిటికీ డబ్బులు కావాలి. మరోపక్క దిల్‌సుఖ్ నగర్ దివాకర్(హర్షవర్ధన్) ఆ ఏరియాలో పెద్ద రౌడీ షీటర్. దందాలు, డ్రగ్స్ డీలింగ్స్ చేస్తూ ఉంటాడు. రాజు సుందరం డైరెక్టర్ అవ్వాలని కథలు చెప్తూ ఉంటాడు. కొత్త కథల కోసం మన్మధుడు సినిమాలో నాగార్జున టేబుల్ కింద మైక్స్ పెట్టి విన్నట్టు అలాంటివి తెప్పించి పబ్లిక్ ప్లేసుల్లో పెట్టి అందరూ మాట్లాడేవి విని కథలు రాసుకుంటూ ఉంటాడు. అలా ఓ రోజు రెండు కోట్ల డీల్ అని వినడంతో తన కష్టాలు తీరడానికి మంచి అవకాశం అని ఆ మైక్‌లో వినిపించిన అడ్రెస్‌కి వెళ్తాడు. అక్కడ భరతనాట్యం అనే ఓ డ్రగ్ చేతులు మారడానికి డీల్ జరుగుతుండగా డబ్బుల బ్యాగ్ అనుకోని డ్రగ్స్ బ్యాగ్ కొట్టుకొచ్చేస్తాడు రాజు సుందరం. ఆ డ్రగ్స్‌ని డబ్బులు చేసుకుందాం అనుకునే క్రమంలో పోలీసాఫీసర్ శకుని(అజయ్ ఘోష్)కి దొరుకుతాడు. ఆ డ్రగ్స్‌ను రాజు ఏం చేశాడు? డ్రగ్స్ కొట్టేసినందుకు రాజుని దివాకర్ గ్యాంగ్ ఏం చేసింది? పోలీసుల నుంచి రాజు ఎలా తప్పించుకున్నాడు.. అనేది మిగతా కథ.

విశ్లేషణ:
‘భరతనాట్యం’ అని టైటిల్‌తో క్రైం కామెడీ డ్రామా తీశాడు డైరెక్టర్ మహేంద్ర. సినిమాలో ఓ డ్రగ్ కి ఈ పేరు పెట్టారు. కానీ సినిమాలో చాలా చోట్ల భరతనాట్యం బదులు భగతనాట్యం అనే వినిపిస్తుంది. సెన్సార్ వాళ్ళు ఓ డ్రగ్‌కి భరతనాట్యం అనే పేరు పెడితే అభ్యంతరం తెలిపితే భగతనాట్యం అని మళ్ళీ మార్చినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు అసలు ఇది దొరసాని డైరెక్టర్ చేసిన సినిమానేనా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ పరిచయంతోనే సాగుతుంది, అసలు కథేంటి అనేది ఇంటర్వెల్ వరకు కూడా అర్ధం కాదు. దానికి తోడు స్లో నేరేషన్. ఫస్ట్ హాఫ్ అంతా బోర్ కొడుతుంది. డార్క్ కామెడీ ట్రై చేసినా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా రాజు సుందరం, దిల్‌సుఖ్ నగర్ దివాకర్ గురించి మిగిలిన పాత్రల గురించి చూపించారు. ఇక ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్‌లో డ్రగ్స్, డబ్బుల కోసం అందరూ తిరగడం, నిఖిల్ స్వామిరారా సినిమా ఫార్మాట్ స్క్రీన్ ప్లే ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. చివర్లో విలన్ తమ్ముడిని నేనే చంపాను అని హీరో ఒప్పుకొని దాని చుట్టూ స్టోరీ అల్లడం.. అతడి నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు బాగున్నాయి. ఇక సినిమా చివర్లో పార్ట్ 2 ఉందని ప్రకటించడం గమనార్హం.

నటీనటుల విశ్లేషణ:
హీరో సూర్యతేజ ఏలే కొత్తవాడైనా బాగానే యాక్ట్ చేశాడు. హీరోయిన్ మీనాక్షి గోస్వామి మాత్రం గెస్ట్ పాత్రలా అప్పుడప్పుడు వచ్చి మెరిసింది. హిందీ, తెలుగు మిక్సింగ్ భాషలో మాట్లాడి వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో హీరో అవ్వాలనే పాత్రలో ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిగా వైవా హర్ష మాత్రం బాగా మెప్పిస్తాడు. అతని వల్లే కాసేపైనా ప్రేక్షకులు నవ్వుకుంటారు. ఓ రకంగా చెప్పాలంటే వైవా హర్షనే సెకండ్ హాఫ్ ఎక్కువగా నడిపిస్తాడు. పోలీసాఫీసర్‌గా అజయ్ ఘోష్, దిల్‌‌సుఖ్ నగర్ దివాకర్‌గా హర్షవర్ధన్, అతని తమ్ముడిగా టెంపర్ వంశీ.. మిగిలిన వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విశ్లేషణ:
భరతనాట్యంలో సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం మాములు కెమెరాతో తీసినట్టు ఉంటాయి. దొరసాని లాంటి అద్భుతమైన ప్రేమకథను సినిమా తీసిన దర్శకుడు మహేంద్ర ఈ భరతనాట్యం సినిమా తీశారంటే మాత్రం నమ్మలేము. ప్రమోషన్స్‌లో సూర్య ఈ కథ రాసుకొని, ప్రొడ్యూసర్ తెచ్చుకొని చివరగా దర్శకుడు ఎంటర్ అయినట్టు చెప్పారు. దీంతో సినిమా వాళ్ళు తీసి మహేంద్ర పేరు వేసుకున్నారేమో అని కూడా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కొత్త ప్రొడ్యూసర్స్, చిన్న బడ్జెట్ కాబట్టి పర్లేదు. ఇక సాంగ్స్ ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వవు. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్లేదు అనిపిస్తుంది.

రేటింగ్: 2/5

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్