27.7 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

కిడ్నీ దొంగలొస్తున్నారు జాగ్రత్త

అవయవ దానం చేయండి నిండు ప్రాణాన్ని నిలపండి. ఇదీ మనం నిత్యం చూసే ఉదాత్త ప్రకటన. అయితే, భాగ్యనగరంలో ఓ వైద్యుడు ఈ సీన్ ను పూర్తి రివర్స్ చేశాడు. వైద్య వృత్తికే కళంకం తెచ్చాడు. ఎంతో కొంత క్యాష్ ఇచ్చేసి, అవయవం దోచేసుకోవడం ఈ ప్రబుద్ధుడి నైజం. సూత్రధారి వైద్యుడైనా, మరి కొందరు పాత్రధారులు ఇందులో ఉన్నారు. ఈ దందాలో ఓ యువకుడు ప్రాణం కోల్పోవడంతో… పోలిసులు తీగ లాగారు. డొంక కదిలింది. హైదరాబాద్ టు ఇరాన్ వయా కేరళగా యధేచ్చగా సాగుతున్న ఈ కిడ్నీ మాఫియా పై స్వతంత్ర ప్రత్యేక కథనం.

అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ కొచ్చిలో వెలుగులోకి వచ్చింది. కేరళ పోలీసులు సాగించిన విచారణలో హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడు ఇందులో ప్రధాన సూత్రధారిగా వెల్లడైంది. బాధితుడు మృతి తో ఈ రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. కేసు విచారణలో భాగంగా తాజాగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో సబిత్‌ నాసిర్‌ అనే యువకుడిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. కిడ్నీ రాకెట్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ముఖ్యమని.. వారే ఈ దందా నడిపిస్తున్నారని తెలిపాడు. వీరిలో ఒక వైద్యుడు ప్రధాన పాత్ర వహిస్తున్నాడని సబిత్‌ నాసిర్‌ వెల్లడించాడు. దీంతో ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్‌ కు చేరుకుంది. మిగతా ఇద్దరు బ్రోకర్లను గుర్తించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. అయితే, కిడ్నీలు విక్రయించిన ఆ వైద్యుడు ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ప్రధాన సూత్రధారి అని నిండుతుడు ఇచ్చిన స్టేట్ మెంట్ కీలకంగా మారింది. సబిత్‌ ఈ దందాలో చేరడానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టరే ప్రధాన కారణమని తెలిసింది. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడంలో ఈ డాక్టర్‌, సబిత్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కొన్ని ఏళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన 40 మంది యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి.. వారి కిడ్నీలను విక్రయించినట్టు సబిత్‌ పోలీసు విచారణలో తెలిపాడు.

కర్ణాటక, తెలంగాణలకు చెందిన పేద యువకులను ఈ ముఠా టార్గెట్‌ చేయడం మొదలెట్టింది. తొలుత ఇరాన్‌ తీసుకెళ్లి, అక్కడ కిడ్నీల విక్రయం సాగిస్తున్నట్టు వెల్లడైంది. బాధితుల రవాణాకు దళారులే పాస్ పోర్ట్, వీసాలను సమకూర్చేవారు. రక్తసంబంధీకులు కానివారు అవయవ దానం చేయడానికి ఇరాన్‌ లో అనుమతి ఉంది. ఆ దేశంలో 1988లో దీనిని చట్టపరం చేశారు. అక్కడ చట్టపర అనుమతి ఉండటంతో బాధితులను అక్కడకు తీసుకెళ్లినట్టు విచారణలో తేలింది. ఈ దందా ఎలా సాగించేవారంటే, తొలుత డోనర్స్ కిడ్నీ ఎవరికి సరిపోతుందో నిర్ధారణ చేసేవారు. అనంతరం ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేపట్టేవారు. తదనంతరం కిడ్నీ ఇచ్చిన వ్యక్తిని 20 రోజులపాటు ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంచేవారు. డోనర్ కొద్దిగా కోలుకున్న తర్వాత ఇండియా తీసుకొస్తారు. ముందుగా ఒక్కో కిడ్నీకి 20 లక్షల రూపాయల వరకు ఇస్తామని ఆశచూపేవారు. తర్వాత తీరిగ్గా అన్ని లెక్కలు చూపించి.. బాదిధుతుల చేతిలో ఆరు లక్షల రూపాయలు పెట్టి, చేతులు దులుపేసుకునేవారు.

దర్యాప్తులో భాగంగా కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్, కేరళకు చెందిన 40మంది యువకులను ఇరాన్ దేశం తీసుకువెళ్లి కిడ్నీ మార్పిడి చేయించినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువమంది పేదలే ఉన్నట్లు వారు తెలిపారు. నగరానికి చెందిన ఒక వైద్యుడితోపాటు మరో ఇద్దరు దళారుల కోసం కేరళ పోలీసులు వెతుకుతున్నారు. కేరళ ఎర్నాకులం కేంద్రంగా వ్యవహారం నడుపుతున్నారని, పేదలను టార్గెట్ చేసుకుని నగదు ఆశ చూపి ఈ దందా సాగిస్తున్నారని కేరళ పోలీసులు పేర్కొన్నారు.అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ, నిరుపేదల కిడ్నీలను దోచుకుంటూ, అవయవ చోరీ నేరాలకు పాల్పడుతున్న సంఘ విద్రోహశక్తులపై కఠిన చర్యలు తీసుకువాలని, ఈ పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్