స్వతంత్ర వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీ నాయకత్వ మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా వున్న బండి సంజయ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ను నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చే నిజమైంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బీజేపీ అధిష్టానం జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే చర్చ జరిగింది.
ఈ సమయంలో బండి సంజయ్ కు జాతీయ స్థాయిలో పదవి కేటాయించడానికి కొంత సమయం తీసుకున్న అధిష్టానం గతంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బండి అవసరాలను జాతీయ స్థాయిలో వాడుకుంటామని నడ్డా ప్రకటించగా తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించగా..బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఏపీ నేత సత్యకుమార్ ను నియమిస్తున్నట్టు పేర్కొంది.