మెగాస్టార్ చిరంజీవి వారసుడు చరణ్ సినిమాలు చేస్తున్నాడు. నాగార్జున వారసుడు చైతన్య, అఖిల్ కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. వెంకటేష్ కుమారుడు ప్రస్తుతం చదువుకుంటున్నాడు. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. అయితే.. బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు ఫస్ట్ మూవీ చేయనున్నాడు..? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు బాలయ్య.. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడు..? మోక్షజ్ఞ తొలి చిత్రం దర్శకుడు ఎవరు..?
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్యను మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిన ప్రతిసారీ టైమ్ వచ్చినప్పుడు చెబుతాను అనేవారు. ఇదిలా ఉంటే.. అప్పట్లో మోక్షజ్ఞ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండడంతో అసలు ఆయనకు సినిమాల్లో నటించాలనే ఇంట్రస్ట్ ఉందా..? లేదా..? అనే డౌట్ కూడా వచ్చింది. అంతే కాకుండా.. మోక్షజ్ఞకు సినిమాల పై ఆసక్తి లేదని… ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ కూడా వినిపించింది. అంతే కాకుండా.. బాలయ్య, ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ద్వారా మోక్షజ్ఞను పరిచయం చేయాలి అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి కానీ.. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు.