స్వతంత్ర, వెబ్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ నుంచి తాజా అప్టేడ్ వచ్చింది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘అన్న దిగుతుండు’ అంటూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అంటే ఆ రోజు మూవీ టైటిల్‌తో పాటు బాలయ్య లుక్‌తో కూడిన గ్లింప్స్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దసరా కానుకగా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
అన్న దిగుతుండు 😎
Team #NBK108 is gearing up to celebrate #NBKLikeNeverBefore on his birthday 💥
Bombarding Updates Loading Soon🥁
Stay hyped for his Arrival🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/lVDOM3Kjdx
— Shine Screens (@Shine_Screens) June 3, 2023