21.7 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

Bachupally Road Accident: చిన్నారి ప్రాణం తీసిన రోడ్డు గుంత..!

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌ బాచుపల్లి విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఉన్న ఓ గుంత చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లికి చెందిన కిషోర్ కూతురు దీక్షిత (8) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. రోజు మాదిరిగానే కిషోర్ తన కూతుర్ని స్కూటీపై స్కూల్‌లో దిగబట్టేందుకు బయల్దేరాడు. రెడ్డి ల్యాబ్స్ వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు ఓ పెద్ద గుంత ఏర్పడింది. అది గమనించిన కిషోర్ అలాగే వెళ్లటంతో బైక్ గుంతలో పడిపోయింది. దీంతో బండి వెనుక కూర్చున్న దీక్షిత ఎగిరి రోడ్డుపై పడింది.

ఆ వెనకాలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు వచ్చింది. పాప రోడ్డుపై సడెన్‌గా పడిపోవటంతో స్కూల్ బస్సు డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనలో దీక్షిత అక్కడిక్కకడే మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిందండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రోడ్డుపై పడిపోయిన చిన్నారి మృతదేహాన్ని హత్తుకొని తండ్రి రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్