చిత్తూరు జిల్లా కుప్పం గుడపల్లి మండలంలో వైసీపీ నేతల దాడులకు దిగారు. ఓటమి తట్టుకోలేక వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. గుత్తర్లపల్లి పంచాయితీ టీడీపీ అధ్యక్షుడు యువరాజ్‌పై వైసీపీ కార్యకర్త అశోక్ రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ సంబరాలు చేసుకుంటుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల వారికి మాటా మాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఘర్షణలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిలించారు.


