జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి కలకలం రేపింది. పట్టణానికి చెందిన రహమాన్ అనే వ్యక్తి కళ్లు తిరిగి పడిపోవడంతో బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో డాక్టర్ అతన్ని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సిబ్బంది సరైన సమయంలో చికిత్స అందిం చలేదని మృతిని బంధువులు ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈనేపథ్యంలోనే డాక్టర్, సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. వారితోపాటు తెచ్చుకున్న డీజిల్‌ను చల్లి నిప్పంటించే ప్రయత్నం చేశారు. పోలీసులు రాకతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సంఘటనలతో ఉద్యోగాలు చేయడం కష్టమంటున్నారు వైద్యులు.


