Andhra Pradesh | తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై అనుమానంతో రగిలిపోయిన భర్త యాసిడ్ పోశారు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. సుధాకర్, ఆదిలక్ష్మి ఇద్దరు బార్యాభర్తలు. భార్య ఆదిలక్ష్మి ఉద్యోగం చేస్తున్నారు. గతకొంతకాలంగా ఆమెను ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఆమె పట్టించుకోకుండా ఉద్యోగం చేస్తూనే వచ్చింది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న సుధాకర్… ఆమెపై యాసిడ్ దాడి చేశారు. దీంతో ఆదిలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


