24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

అతియాస్ కిచెన్ ను ప్రారంభించిన కమెడియన్ అలీ

హైదరాబాద్: గండిపేట మెయిన్ రోడ్, షాప్ నంబర్ 6లో అతియాస్ కిచన్ ని సినీ నటులు ఆలీ, సతీమణి జుబెదా ఆలీతో ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ఆలీ కుటుంబం ఈరోజు ఇఫ్తార్ విందుని అతియాస్ కిచెన్ లో కుటుంబ సమేతంగా విచ్చేసి, సాయంత్రపు అల్లా ప్రార్థన అనంతరం ప్రారంభించారు.

ఆలీ మాట్లాడుతూ: “నాకు షేక్ యూసఫ్, అతియా ఇద్దరూ మలేసియాలో పరిచయం, అక్కడ కూడా వీరికి హోటల్స్ ఉన్నాయి, కానీ ఇండియాలో హైదరాబాద్లో కిచెన్ ఓపెన్ చెయ్యాలని ఎప్పుడో అన్నారు, 2023 డిసెంబర్ లోనే ప్రారంభం అవ్వాలిసింది, కానీ ఇప్పుడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వీరి దగ్గర ఇండో, అరబిక్ రుచులే కాక్కుండా ఢిల్లీ రుచులు, నెల్లూరు రుచులు కూడా అద్భుతంగా ఉంటాయి, మొన్న మా ఇంటికి నెల్లూరు స్టైల్ లో వంటలు చేసి పంపారు.. నిజంగా టేస్ట్ అద్భుతంగా ఉన్నాయి.” అని అన్నారు.

జుబెదా ఆలీ మాట్లాడుతూ.. “భోజన ప్రియులకు అతియాస్ కిచెన్ అనేది మంచి వేదిక, నార్త్ ఇండియన్, అరబిక్, వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల రుచులు వీరి దగ్గర ఉన్నాయి.. మండీ కూడా ఇక్కడ చాలా స్పెషల్, కోకాపేటలో మెయిన్ సెంటర్ లో ఇంత పెద్ద కిచెన్ పెట్టడం నిజంగా హ్యాపీగా ఉంది.” అని అన్నారు.

అతియాస్ కిచెన్ అధినేత షేక్ యూసఫ్ అహమద్ మాట్లాడుతూ: “ఇండియాలో మొదటి సారి మా కిచెన్ లాంచ్ చేస్తున్నాం. మేము అంత పెద్ద బ్రాండ్ కాకపోయినా ఆలీ గారూ లాంటి వ్యక్తి మాకు సపోర్ట్ గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీ ఫ్లేవర్స్ తో కరీమ్స్ ముఘలై జయకా కూడా ప్రారంభించాం. అతియాస్ కిచెన్ నెల్లూరు ఫ్లేవర్స్ పేరుతో ఇంకో బ్రాంచ్ ఉంది, అందులో టిఫిన్స్, లంచ్, డిన్నర్ అన్ని ఉంటాయి. చిన్న బ్రాండ్ అయినప్పటికీ పెద్ద రెస్టారెంట్ లకి పోటీగా అంతకు మించి రుచిగా మా వంటలు ఉంటాయి.” అని చెప్పారు.

సంస్థ అధినేత్రి అతియా మాట్లాడుతూ: “అల్లా దయ వల్ల ఇండియాలో కూడా ఈ కిచెన్ ను ప్రారంభించాం. ఇక్కడ మన హైదరాబాద్ లో ఓపెన్ చెయ్యడం చాలా స్పెషల్, ఇండో, అరబిక్ రుచుల కోసం మీరు మా దగ్గరకు రావొచ్చు.” అని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్