22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

‘అష్టదిగ్భంధనం’ మూవీ రివ్యూ

విడుదల తేదీ: 22-09-2023

నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.
రచన – దర్శకత్వం: బాబా పి.ఆర్,
నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్,
మ్యూజిక్: జాక్సన్ విజయన్
కెమెరా: బాబు కొల్లబత్తుల
ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల,
ఫైట్స్: రామ్ క్రిషన్, శంకర్ ఉయ్యాల,
లిరిక్స్: శ్యామ్ కాసర్ల, పూర్ణ చారి,
ఆర్ట్: వెంకట్ ఆరే
పీఆర్వో: సురేష్ కొండేటి,

థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ట్విస్టులతో ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లే నడిపిస్తే ఆడియన్స్ తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఈ ఫార్ములాను నమ్మి చేసిన సినిమానే ‘అష్టదిగ్భంధనం’. ‘ఎ గేమ్ విత్ క్రైమ్’ అనేది ట్యాగ్ లైన్. ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే క్రైమ్స్‌తో కూడిన ఒక గేమ్‌లా సినిమా ఉంటుంది. ‘సైదులు’ అనే సినిమాతో డైరెక్టర్‌గా మారిన బాబా పీఆర్ రెండో సినిమాకే ఇలాంటి థ్రిల్లర్ కథను ఎంచుకోవడం గ్రేట్ అనే చెప్పాలి. ‘రచ్చ’ సినిమాలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక కోట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పలు లఘు చిత్రాలు, సినిమాల్లో నటించిన సూర్య భరత్ చంద్ర ‘అష్టదిగ్భంధనం’ సినిమాలో హీరోగా నటించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రం రివ్యూ ఇప్పుడు చూద్దాం…

కథ: శంకర్ అనే రౌడీ షీటర్.. తన తోటి రౌడీ షీటర్ రాజకీయ నాయకుడిగా మారి తననే అవమానిస్తుంటే ఇగో దెబ్బతిని తను కూడా ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 కోట్లు చెల్లించేందుకు శంకర్ సిద్ధమవుతాడు. అందుకోసం పక్కా ప్లాన్ వేస్తాడు. రూ. 50 కోట్ల కోసం అతడు ఎలాంటి పథకం పన్నాడు? హీరోహీరోయిన్లు ఆ పథకంలో ఎలా ఇరుక్కున్నారు? రౌడీ షీటర్ శంకర్‌కు మంత్రి ఇచ్చిన వంద కోట్లు ఏమయ్యాయి? అసలు ఎవరు ఎవరికి స్కెచ్ వేశారు? చివరికి కథ ఎలా సుఖాంతమైంది తెలుసుకోవాలంటే థియేటర్‌లో సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ఈ యుద్ధం రాజ్యం కోసమో, రాణి కోసమే జరిగేది కాదని.. ఇద్దరు వ్యక్తుల అహం వల్ల జరిగేదని ట్రైలర్‌లో చూపించారు. అది సినిమాలో పక్కాగా కనిపించింది. దర్శకుడు బాబా తనకు ఇది రెండో సినిమానే అయినా తన స్కీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాప్ అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని క్యారెక్టర్స్ గురించి సస్పెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడు.. సెకెండాఫ్‌లో వాటికి కన్‌క్లూజన్ ఇచ్చాడు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ అయితే ఊహించలేని విధంగా ఉంటుంది. ఇక సెకెండాఫ్ అంతా ఏ క్షణం ఏం జరుగుతుందా అనే ఆసక్తితో నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకెండాఫ్‌లో దర్శకుడు ఎక్కువ ట్విస్టులను ప్లాన్ చేశాడు. ట్రైలర్ చూసి ఇదేదో క్రైమ్ కథో, లస్ట్ స్టోరీనో అనుకునేవాళ్లకు.. సినిమా చూస్తే ఆ అభిప్రాయం మారిపోతుంది. అక్కడక్కడ ఒకట్రెండు లాజిక్స్‌ను వదిలేస్తే ఓవరాల్‌గా సినిమా బాగుంది. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలను దర్శకుడు చక్కగా చూపించారు.

నటీనటుల పనితీరు:
హీరోగా నటించిన సూర్య భరత్ చంద్ర తన నటనతో పర్వాలేదనిపించాడు. ఇక హీరోయిన్ విషిక తన అందచందాలతో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేయడమే కాకుండా తన నటనకు కూడా మంచి మార్కులు వేయించుకునేలా ఉంది. రౌడీ షీటర్ శంకర్ పాత్ర చేసిన అతను విలనిజం బాగా పండించాడు. అలాగే మంత్రి పాత్ర చేసిన అతను కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అందరూ కొత్తవాళ్లే అయినా.. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లు రాడానికి బాగా సహకరించారు.

చివరిగా: థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు చూడాల్సిన సినిమా

రేటింగ్: 2.5/5

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్