ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన వెళ్లారు. ఫార్ములా రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఈడీ ఆయనను ప్రశ్నిస్తోంది. HMDA ప్రిన్సిపల్ సెక్రెటరీగా అరవింద్ కుమార్ ఉన్న సమయంలో ఫార్ములా రేసింగ్ నిధులకు సంబంధించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు రూ.45.71 కోట్ల బదిలీపై అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో అర్వింద్‌కుమార్‌ను విచారిస్తున్నట్లు సమాచారం.