స్వతంత్ర వెబ్ డెస్క్: అరి’ సినిమాతో బాక్సాఫీస్‌పై గట్టిగానే గురిపెట్టారు దర్శకుడు జయ శంకర్. పేపర్ బాయ్ చిత్రంతో తొలి అడుగులోనే విజయం సాధించిన జయ శంకర్.. ఇప్పుడు ‘అరి’ అనే యూనివర్సిల్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘అరి’ అనే టైటిల్‌తోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసి.. ఫస్ట్ లుక్, టీజర్, ప్రమోషనల్ వీడియోలతో ‘అరి’పై ఆసక్తిరేపారు. అరిషడ్వర్గాలోని కామ.. క్రోధ.. లోభ.. మొహ.. మద.. మాత్సర్యాల చుట్టూ తిరిగే కథ ఇది. ‘మనిషి ఎలా బతకకూడదు’ అనే అంశాన్ని కొత్త కోణంలో చూపించారు. ‘అరి’షడ్వర్గాలు ఉన్న ఆరుగురు శత్రువులతో ఓ ఎయిర్ హోస్టెస్ ఎలాంటి పోరాటాన్ని సాగించిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు జయ శంకర్.
ఈ చిత్రాన్ని ఆగష్టు లో విడుదల చేయబోతున్నట్లు జయ శంకర్ తెలిపారు. ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమాన్ని దర్శించుకున్నారు. తన కుమారుడికి అన్నప్రాసన చేయించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అరి చిత్రంలోని పలు సన్నివేశాలను శబరిమాత ఆశ్రమంలో చిత్రీకరించినట్లు తెలిపారు. అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యర్, సుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, వైవా హర్ష ఈ ఆరుగురు ఆరు ఇంపార్టెంట్స్ రోల్స్‌లో నటించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ‘అరి’ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా.. శివశంకర వరప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. కాసర్ల శ్యామ్, వనమాలి సాహిత్యం అందించారు. జి.అవినాష్ ఎడిటర్. భాను, జీతు కొరియోగ్రాఫర్లు.