మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలలో అత్యాధునిక అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) సాంకేతికతను వినియోగిస్తున్నామని, తద్వారా అధునాతన ఆర్థోపెడిక్ సర్జరీలలో అగ్రగామిగా నిలిచినట్లుగా అరీట్ హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ సాంకేతికతతో 50కి పైగా సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన అరీట్ హాస్పిటల్స్ మినిమల్లీ ఇన్వాసివ్ మోకాలి శస్త్రచికిత్సల ప్రమాణాన్ని పునర్నిర్వచిస్తోంది. సంప్రదాయ మోకాలి మార్పిడి పద్ధతులు, రోబోటిక్ సర్జరీ కంటే ఏఆర్ సాంకేతికత అనేక కీలక ప్రయోజనాలను అందిస్తుంది.
శస్త్రచికిత్స జరిగే సమయంలో (రియల్ టైమ్ లో) మోకాలి కీలును త్రీడీలో చూపించటంతో, సర్జన్లు కచ్చితత్వంతో ఇంప్లాంట్ ప్లేస్మెంట్ను సాధించడానికి వీలుకల్పిస్తుంది. ఫలితంగా మెరుగైన అమరిక, వేగంగా కోలుకోవడంతో మెరుగైన పనితీరు ఉంటాయి. రోబోటిక్ సిస్టమ్ మాదిరిగా కాకుండా ఏఆర్ సాంకేతికత శస్త్రచికిత్స సమయంలో సౌలభ్యానికి, అనుకూలతకు వీలుకల్పిస్తుంది. దీనితో వేర్వేరు మోకాలి పరిస్థితులకు తగినట్టుగా ప్రణాళికలను మార్చుకోవచ్చు (డైనమిక్ అడ్జస్ట్మెంట్). ఈ సౌకర్యంతో శస్త్రచికిత్స ఖచ్చితత్వాన్ని పెరుగుతుంది. శస్త్రచికిత్స తరువాత వచ్చే నొప్పిని తగ్గించి, త్వరగా కోలుకునేలా చేస్తుంది.
ఈ సందర్భంగా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, ఆర్థోస్కోపీ, స్పోర్ట్స్ ఇంజురీస్, రోబోటిక్ & జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాత్ రెడ్డి లక్కిరెడ్డి మాట్లాడుతూ… అరీట్ హాస్పిటల్స్లో మేం మోకాలి శస్త్రచికిత్స రోగులకు అసాధారణమైన సంరక్షణ అందించేందుకు గాను మా అనుభవజ్ఞులైన అర్థోపెడిక్ నిపుణుల బృందాన్ని సరికొత్త అగ్మెంటెడ్ రియాలిటీ (AR) సాంకేతికతతో కలిపి అందిస్తున్నాం. 50,000 మోకాళ్ల శస్త్రచికిత్సలు చేసిన తర్వాత, ఈ అత్యాధునిక సాంకేతికత సంక్లిష్టతలను తగ్గించడమే కాకుండా దీర్ఘకాలిక ఫలితాలను ఎలా మెరుగుపరుస్తుందో మేం ప్రత్యక్షంగా చూశాం. ఈ సాంకేతికతతో, సంక్లిష్టమైన విధానాలు కూడా మరింత అందుబాటులోకి వస్తాయి, ఖచ్చితమైనవిగా మారుతాయి. ఇది అనుభవజ్ఞులైన సర్జన్లు, శిక్షణలో ఉన్న వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది” అని అన్నారు.
మెడికల్ డైరెక్టర్ & క్రిటికల్ కేర్ మెడిసీస్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి డాక్టర్ ఎస్. పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “సమర్థమంతమైన ఆరోగ్య సంరక్షణను అందించటానికి అరీట్ హాస్పిటల్స్ ఎంత దూరమైనా వెళ్తుంది. దానికి నిదర్శనంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలలో ఈ అగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను అందిస్తున్నాము. ఏఆర్ సాంకేతికతను మా వైద్యులకు అందించడం ద్వారా, వారు తక్కువ సమస్యలతో శస్త్రచికిత్స చేయగలరని మేము ఆశిస్తున్నాం అన్నారు.