Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయా?

  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర చివరి దశకు చేరింది. ఓటు వేసే సమయం ఆసన్నం కావడంతో పోలింగ్‌ రంగానికి సర్వం సిద్ధమైంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, ఏపీ 175అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఈసారి ఓటింగ్‌ శాతం పెరుగుతుందా! తగ్గుతుందా అనేదే జోరగా చర్చ సాగుతోంది. ఒకవేళ పోలింగ్‌ పెరిగితే ఎవరికి లాభం, తగ్గితే ఎవరికి నష్టం అన్నది కూడా రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారగా ఇప్పటికే గెలుపోటములపై భారీగా బెట్టింగ్‌లు నడుస్తు న్నాయి.

   తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ అయింది. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగియడం తో 17 పార్లమెంట్ స్థానాలకు, ఏపీలో 175అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకో కుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టిన ఎన్నికల సంఘం మరింత భద్రతను పెంచింది. సెంట్రల్ ఫోర్స్,మైక్రో అబ్సర్వర్స్,వెబ్ కాస్టింగ్ తో మానిటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది.

   ఇక ఎన్నికల వేళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున జనం తమ సొంతూరు బాటపట్టారు. అయితే, ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తు న్నారు. ఏపీలో అసెంబ్లీకి, పార్లమెంటుకు కలిపి ఎన్నికలు జరుగుతుండటంతో అంతా ఉత్సాహం కనబ రుస్తున్నారు. రాష్ట్రంలో విపక్ష కూటమి, అధికార పార్టీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరుతో చావోరేవో అన్నట్టుగా తలపడుతున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసి అభ్యర్థులు ఉంటే, రాష్ట్రంలో పోటాపోటీ పరిస్థితి నెలకొన్నకారణంగా ప్రజలు కూడా ఓటేసేందుకు ఆసక్తి చూపుతు న్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడి వారంతా పల్లెబాట పట్టారు. ముఖ్యంగా హైద రాబాద్‌ నుంచి భారీ ఎత్తున ఓటర్లు తమ ఊరికి పయనమయ్యారు. భాగ్యనగరం నుంచి పల్లెకు రప్పించేందుకు పార్టీ అభ్యర్థులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందుకోసం సొంత ఖర్చుతో బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. దీంతో ఏపీ వాసులు భారీగా తరలివెళ్లి తమ ఓటు హక్కును వినియోగిం చుకోను న్నారు. ఇక ఈసారి యువత జోరు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణంగా కొత్తగా యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోను న్నారు. ఒక్క ఏపీలోనే దాదాపు 10 లక్షలకుపైగా యవత తొలిసారి ఓటు వేయబోతున్నారు. దీంతో పోలింగ్‌ శాతం పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.

   తెలంగాణలోనూ బీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఎన్నికల సమరం వాడి వేడిగా సాగుతోంది. రాష్ట్రంలోపాగా వేసేందుకు కమలనాథులు, ఓడిన కసిని తీర్చుకునే వ్యూహంలో గులాబీ నేతలు ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే సత్తాను చాటాలని ఎత్తుగడలు వేస్తోంది. ఇలా ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న వేళ. పోలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. తమకే ఓటు వేసేలా ఓటర్లకు గాలెం వేస్తూ పోలింగ్‌ కేంద్రానికి రప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా తెలంగాణలోనూ గతంలో కంటే ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం కనిపి స్తోంది.

   మరోపక్క పోలింగ్‌శాతం పెరడగానికి భానుడు కూడా ఓ కారణమేనని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకూ 47 డిగ్రీలతో విరుచుకుపడుతూ నిప్పుల వర్షం కురిపించిన భానుడు కాస్త కరుణించాడు. దీంతో వాతావరణం చల్లబడింది. లేదంటే ఎండ తీవ్రతతో పోలింగ్‌ శాతం తగ్గే అవకాశం ఉండొచ్చని అంతా భావించారు. కానీ ఆ ప్రభావమేమీ ఓటింగ్‌పై పడేలా లేదు. మరోపక్క మద్యం, నోట్ల కట్టలు కూడా ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏపీలో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల రణరంగంలో గెలుపు కోసం అటు టీడీపీ, జనసేన, ఇటు వైసీపీలు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఓటింగ్‌శాతం పెరిగే అవకాశమున్నట్టు తెలు స్తోంది. మరోపక్క ఓటర్లలో చైతన్యం పెంచేందుకు అధికారుల అవగాహన కార్యక్రమాలతోపాటు వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ ముమ్మరంగా దేశ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఊదర గొడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ కూడా వివిధ రూపాల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రచారం చేస్తోంది. వీటికితోడు పార్టీలు విడుదల చేసిన మేని ఫెస్టోలపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వివిధ సామాజిక సంస్థలు ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నాయి. ఇలా అన్ని రకాలుగా సాగుతున్న ప్రచారం సానుకూల ఫలితం చూపుతుందని భావిస్తున్నారు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్