23.7 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

అప్సరా రాణి బర్త్ డే స్పెషల్‌గా ‘రాచరికం’ పోస్టర్

విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్‌గా ‘రాచరికం’ అనే చిత్రం రాబోతోంది. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. హీరోయిన్ అప్సరా రాణి పుట్టిన రోజు (జనవరి 12) సందర్భంగా రాచరికం మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే అప్పరా రాణికి అద్భుతమైన పాత్ర లభించినట్టుగా కనిపిస్తోంది. కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, రక్తంతో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా ఉన్నారు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ రానుంది.

ఈ చిత్రంలో విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీకి వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరా మెన్ గా పని చేశారు. ఈ సినిమాకు జేపీ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు : విజయ్ శంకర్, అప్సరా రాణి, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : ఈశ్వర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చాణక్య
కథ, స్క్రీన్, దర్శకత్వం : సురేష్ లంకలపల్లి
కెమెరామెన్ : ఆర్య సాయి కృష్ణ
సంగీతం : వెంగి
ఎడిటర్ : జేపీ
పీఆర్వో : సాయి సతీష్

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్