స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైలో మూడేళ్ల కిందటే ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరో ట్విస్ట్ ఏంటంటే అప్సర గర్భవతి కాదంటూ పోస్ట్‌మార్టం నివేదికలో తేల్చారు వైద్యులు. భర్తతో విభేదాల అనంతరం ఏడాది క్రితం ఆమె తల్లితో కలిసి హైదరాబాద్‌కు వచ్చేసింది. జాతకం కోసం మొదట సాయికృష్ణ దగ్గరకు వెళ్లింది. అనంతరం పూజల పేరుతో ఇద్దరు దగ్గరయ్యారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే ఇద్దరి మధ్య బంధాన్ని బయట పెడతానని బెదిరింపులకు దిగింది. దీంతో ఆమెను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఈనెల 3వ తేదీ పక్కా ప్లాన్ ప్రకారం అప్సరను హత్య చేశాడు. సాయికృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు 14రోజుల పాటు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.