డ్రగ్స్‌పై ఎక్స్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. విశాఖ డ్రగ్స్ కంటైనర్ ఘటనను ప్రస్తావిస్తూ… అమిత్‌షాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గత పాలనలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయిందని విమర్శించారు. దేశంలో పలు ప్రాంతాల్లో గతంలో దొరికిన డ్రగ్స్‌కు.. విశాఖ, విజయవాడలోని సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నారు. అలాంటివి అరికట్టాలంటే సమగ్ర ప్రణాళిక అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పవన్ కళ్యాణ్.