ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్… ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబరు 11 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పలు చట్ట సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాత్కాలిక ప్రాతిపదికన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజా అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకురానున్నారు.