25.2 C
Hyderabad
Thursday, November 21, 2024
spot_img

పాలకులు ఎవరైనా కాంట్రాక్ట్ ఆయనకే…. మరి ఈ సారి సంగతి ఏంటి?

    ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు ఎదురుండదు. కాంట్రాక్టులు రేసు గుర్రాళ్లా పరుగెత్తుకుంటూ వస్తాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంట్రాక్టులను పువ్వుల్లో పెట్టిస్తాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఆయన పై విరుచుకుపడిన పార్టీలు అధికారంలోకి రాగానే మళ్లీ ఆయనకే కాంట్రాక్టులు అప్పగిస్తాయి. ఎందుకలా అంటే ఆయన లేకపోతే పాలకులకు నిమిషం కూడా గడవదు. ఇంతకీ ఎవరాయన? ఏంటా కంపెనీ? మరిప్పుడు ఏం జరిగింది.?

   ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు ఎదురుండదు. కాంట్రాక్టు పనులు ఆయన వద్దకే పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆయన మీద ఎన్ని విమర్శులు చేసినా మళ్లీ ఆయన కంపెనీకే కాంట్రాక్టులు అప్పగిస్తాయి. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ అప్పగింతల ద్వారా తన అభిమానం చాటుకుం టుంటా రు. అదే మేఘా కంపెనీ, గత ఎన్నికల ముందు ముచ్చట పడి కేవలం 966 కోట్లు పార్టీలకు విరాళంగా ఇచ్చింది. దాని అనుబంధ సంస్థ అయిన వెస్టర్స్ యుపి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మరో 220 కోట్లు విరాళంగా చదివించుకుంది. రైల్వే- టన్నెళ్లు-లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల్లో చేయి తిరిగిన ఈ కంపెనీ ఇప్పుడు హిమాలయాల్లో జోజిల్లాలో రోడ్డు టన్నెల్ కూడా నిర్మిస్తుంది. అలా మేఘా కంపెనీ అందరిదిలా తయారైంది. పైగా చేతిలో రెండు పవర్‌ఫుల్ న్యూస్ చానెళ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన కంపెనీ ఏ మూలకూర్చున్నా కావలసినవన్నీ దగ్గరుండి మరీ వడ్డించేస్తుంటారు. ఇప్పుడు ఆ కంపెనీకి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కారు ఇవ్వాల్సిన 1498 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు వ్యవహారం సీఎంవోకు చేరినట్లు తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును నవయుగ నుంచి రివర్స్‌టెండర్ ద్వారా మేఘా కంపెనీ దక్కించుకుంది. అయితే ఆ కంపెనీకి ప్రభుత్వం 1498 కోట్లు బకాయి పడింది. దాన్ని ఆగస్టులోగా ఇచ్చేస్తామని నాటి వైఎస్ జగన్‌ హామీ ఇచ్చినప్పటికీ ఖజానాలో కాసులు లేక పెండింగ్‌లో పెట్టేశారట. తనకు మేలు చేసిన జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మేఘా కంపెనీ బిల్లులు ఆగిపోతాయని వైసీపీ సహా టీడీపీ-జనసేన-మీడియా వర్గాలు అంచనా వేశాయి. ఎందు కంటే గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, మీడియా సంస్థలకు జగన్ సర్కారు బిల్లులు నిలిపివేసింది. ఇప్పుడు టీడీపీ సర్కారు కూడా అదేవిధానం పాటిస్తుందన్న అంచనా వ్యక్తమవు తోంది. పైగా టీడీపీని లక్ష్యంగా చేసుకుని బాబు-లోకేష్‌ను అప్రతిష్ఠపాలు చేసిన పలు ఛానెళ్లలో మేఘా భాగ స్వామి కాబట్టి లోకేష్ రెడ్‌బుక్ మేఘా నుంచే అమలవుతుందన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది. పైగా ఐదేళ్ల జగన్ పాలనలో టీడీపీని రాజకీయంగా చంద్రబాబునాయుడు-లోకేష్‌పై వ్యక్తిగతంగా బురదచల్లి జగన్ కళ్లలో ఆనందం చూసిన ఛానెళ్లలో మేఘా కంపెనీ భాగస్వామి కాబట్టి.. లోకేష్ రెడ్‌బుక్ ప్రకారం ఇక ఆ కంపెనీకి కష్టకాలం తప్పదన్న భావన అటు పార్టీ వర్లాల్లో కూడా కనిపి స్తోంది. అంటే ఒప్పందం ఉల్లంఘించిన మేఘా కాంట్రాక్టు రద్దు చేస్తారన్న భావన టీడీపీ వర్గాల్లో బలంగా నాటుకుపో యింది.

  ఈ నేపథ్యంలో మెగా కంపెనీకి చెల్లించాల్సిన 1498 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లు వ్యవహారం ఆగమేఘాలపై సీఎంవోకు వెళ్లడంపై ఆర్ధికశాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 400 కోట్ల రూపా యల చొప్పున మొత్తం బిల్లుల ఫైలు సీఎంవోకు చేరినట్లు తెలుస్తోంది. దీనితో మేఘా కంపెనీ బిల్లులు వెంటనే చెల్లిస్తారా? పెండింగ్‌లో పెడతారా? అన్న ఉత్కంఠకు తెరలేచింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల నుంచి, నత్తనడక పనుల వరకూ ప్రశ్నల వర్షం కురిపించిన టీడీపీనే ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఆ బిల్లుల వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. పైగా మే నాటికి 7,380 కోట్ల సీలేరు పంప్డ్ స్టోరేజీ జల విద్యుచ్చక్తి ప్రాజెక్టును కూడా మేఘా కంపెనీకే ఇచ్చారు. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాలపరిమితిని మరో 36 నెలలపాటు పొడిగించాలని ఎన్నికల ముందు వరకూ జెన్కోపై ఒత్తిడి తీసుకురావడం ఆ మేరకు జగన్ ప్రభుత్వంలో సీఎంవోలో ఒక వెలుగు వెలిగిన ఓ కడప రెడ్డి జెన్కోపై ఒత్తిడి తీసుకురావటం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. సీలేరు పంప్డ్ స్టోరేజీ జలవిద్యుచ్చక్తి ప్రాజెక్టు-పోలవరం హైడల్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడం ద్వారా 10,180 కోట్ల ఆర్ధిక ప్రయోజనం పొందేలా ఇంధనశాఖపై నాటి సీఎంఓలో జగన్ బృందం ఒత్తిడి పెంచిందన్న ఆరోపణలు అప్పట్లో బహిరంగంగానే వినిపించాయి.

   నిజానికి రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మేఘా కంపెనీ 2019 నవంబర్‌లో 1558.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును దక్కించుకుంది. అయితే చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. అదే ఊపులో 3,270 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోలవరం విద్యుదుత్పత్తి ప్లాంటును 2024 నాటికి పూర్తి చేస్తానని జెన్కోతో ఒప్పందం చేసుకుంది. కానీ అక్కడా అదే పరిస్థితి. ఫలితంగా ఒప్పంద కాలపరిమితి ముగిసింది. నిబంధనల ప్రకారమైతే కాలపరిమితి లోపు ప్రాజెక్టు పూర్తి చేయనందుకు కంపెనీకి జరిమానా లేదా 60 సీ నిబంధనల కింద కాంట్రాక్టు రద్దు చేయాలి. కానీ విచిత్రంగా తమ గడువు పెంచాలని మేఘా కంపెనీ కోరడం దాన్ని జెన్కోలో చర్చకు పెట్టడం ఆగమే ఘాలపై జరిగిపోయింది. సాగునీటి ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తయితేగానీ విద్యుదుత్పత్తి ప్లాంటును పూర్తి చేయడం కుదరదని, పోలవరం సాగునీటి ప్రాజెక్టును 2026లో పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించిందంటూ జెన్కోకు మేఘా కంపెనీ ఒక లేఖ రాసింది. కాగా మే నెలలో జరిగిన జెన్కో బోర్డు సమావేశంలో మేఘా కంపెనీ రాసిన లేఖను అజెండాగా చేర్చారు. అయితే దాన్ని తిరస్కరించిన బోర్డు.. లేఖపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దానితో ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిర్ణయం కోసం మేఘా కంపెనీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యం లో కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వం మేఘా కంపెనీకి పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టు కాలపరిమితి పెంచుతుందా ? సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయనందున 60 సీ నిబంధనల కింద కాంట్రాక్టును రద్దు చేస్తుందా ? లేక జరిమానాతో విడిచిపెడుతుందా? చూడాలి. అలాగే సీలేరు పంప్డ్ స్టోరేజీ జలవిద్యుచ్చక్తి ప్రాజెక్టు- పోల వరం హైడల్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడం ద్వారా 10,180 కోట్ల ఆర్ధిక ప్రయోజనం పొందేందుకు సహకరిస్తుందా? తిరస్కరిస్తుందా? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

Latest Articles

ఐటీ కోసం కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం – నారా లోకేశ్‌

మూడు నెలల్లో విశాఖకు TCS వస్తుందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ కంపెనీలు, ఉద్యోగాల కల్పనపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐదు సంవత్సరాల్లో 5 లక్షల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్