స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో రేపు సీఎం జగన్ పర్యటన నేపధ్యంలో జన జాగరణ సమితి ఏర్పాటు చేసిన ఫెక్సీలు కలకలం రేపుతున్నాయి. ‘రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం సుస్వాగతం’ అంటూ నగరంలో పలు చోట ఫ్లెక్సీలు కట్టారు. ప్రధాని మోదీ జగన్ ను సన్మానించి ‘క్యాపిటల్ లెస్ సీఎం’ బిరుదు ఇవ్వాలని ఆ సంస్థ కన్వీనర్ వాసు తెలిపారు. అమరావతి రైతులను రోడ్డున పడేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మళ్లీ విశాఖలో జగన్ కాపురం పెడతానంటున్నారని విమర్శించారు. కాగా ఉత్తరాంధ్రలో పర్యటించనున్న జగన్ భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టు మిగులు పనులు, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణాలకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.