తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపింది. ఈలోపే నాంపల్లి కోర్టులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 90 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ ఇవ్వా లని ప్రణీత్‌రావు కోరాడు. ఇదే సమయంలో తప్పులు కరెక్ట్ చేసి మళ్లీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు పోలీ సులు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు. పోలీసు ల వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు. ప్రణీత్‌రావు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.