దువ్వాడ దుమారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఆగి ఉన్న కారును ఢీకొట్టారు మాధురి. ప్రమాదంలో మాధురికి గాయాలుకావడంతో వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే,.. తనకు వైద్యం వద్దంటూ మాధురి మొండికేశారు.
దువ్వాడ వాణి ఆరోపణలు, సోషల్ మీడియా ట్రోల్స్ భరించలేక తాను ఆత్మహత్యకు యత్నించినట్టు చెబుతున్న మాధురి.. ఆగి ఉన్న కారును ఢీ కొట్టినట్లు తెలిపింది. తన మీద ఆరోపణలు చేస్తే తీసుకోగలను, కానీ తన పిల్లలపై ఆరోపణలు చేస్తే తట్టుకోలేనని.. తనకు ఏ ట్రీట్ మెంట్ అవసరం లేదని… బతకాలనే లేదని చెప్పింది. తన పిల్లలపై చేసిన ఆరోపణలకు పోలీసులు దువ్వాడ వాణిని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. లేదంటే మళ్లీ ఆత్మహత్య చేసుకుంటానంటోంది.