నాయకత్వం అరెస్టయి జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వేళ మరో షాక్ తగిలింది. ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. కేబినెట్‌తో పాటు పార్టీ పదవులను వదులుకున్నారు. ఇప్పటి వరకు ఆయన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ ప్రకటన చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు, అవినీతిపై పోరాడాలన్న బలమైన సంకల్పాన్ని చూసి ఆప్‌లో చేరానన్నారు. కానీ ఈరోజు ఆ పార్టీనే అవినీతికి అడ్డాగా మారిపోయిం దన్నారు. అందుకే దీనిని వీడాలని నిర్ణయించుకు న్నానని రాజ్‌కుమార్ వెల్లడించారు. ఆప్‌లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని ఆరోపించారు. తాను దళితుల కోసం పని చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండటం వృథా అని వ్యాఖ్యానించారు. ఆయన పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. మద్యం విధానానికి సంబంధిం చిన మనీలాండరింగ్ కేసు ఆప్‌ను కుదిపేస్తోంది. కేజ్రీవాల్, సీనియర్ నేతలు మనీశ్ సిసోదియా, సంజయ్‌సింగ్‌లు ఈ కేసులో అరెస్టయ్యారు. ఇటీవలే సంజయ్ బెయిల్‌పై బయటకు వచ్చారు. మరో కీలక నేత సత్యేందర్ జైన్ కూడా మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు.


