ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తిసర్కరించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నేడు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తన చిన్న కుమారుడుకి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకిస్తోంది. కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్ష్యులను, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ చెబుతోంది. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన కొందరిని కవిత బెదిరించారని అందుకు ఆధారాలు ఉన్నాయని కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును ఈడీ కోరింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో మార్చి 15న అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. నేడు బెయిల్ రాకపోతే.. రేపు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. తన చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున చదివించేందుకు, తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, గత నెలలోనే కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనను పది రోజులపాటు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని, స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. చెప్పాల్సినవన్నీ చెప్పానని, కుమారుడి చదువు కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కవిత కోరారు. ఇరువురి సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తీర్పును రిజర్వు చేశారు. ఈ నేపథ్యంలో స్పెషల్ జడ్జి తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 20న ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా కవితను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలంటూ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేయడం తో వారం రోజుల్లో ఆమెను తీహార్ జైల్లోనే ఎంక్వయిరీ చేయటడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ ఎంక్వయిరీని రద్దు చేయాల్సిందిగా కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.