37.5 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

ఏపీలో అంగన్ వాడీ పోస్టుల భర్తీ.. ఆ జిల్లాలో ఖాళీలు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తరచూ అంగన్ వాడీ లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంటుంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలోని వివిధ‌ అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో 25 వ‌ర్క‌ర్లు, హెల్ప‌ర్లు, మినీ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్టు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శాంతకుమారి తెలిపారు.
నాలుగు అంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త‌లు, 17 హెల్ప‌ర్‌, 4 మినీ అంగ‌న్‌వాడీల్లో కార్య‌క‌ర్త‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. హెల్ప‌ర్ పోస్టులు బొబ్బిలిలో 2, చీపురుప‌ల్లిలో 2, గ‌రివిడిలో 3, రాజాంలో 2, వియ్యంపేట‌లో 3, విజ‌య‌న‌గ‌రంలో 5 ఖాళీల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్టు తెలిపారు.
మిని అంగ‌న్‌వాడీల్లో కార్య‌క‌ర్త‌ల పోస్టులు బాడంగిలో 1, బొబ్బిలిలో 2, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 1, చీపురుప‌ల్లిలో 3, గ‌రివిడిలో 4, రాజాంలో 3, ఎస్‌.కోట‌లో 1, వియ్యంపేట‌లో 3, గంట్యాడ‌లో 1, భోగాపురంలో 1, విజ‌య‌న‌గ‌రంలో 5 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్ధులు క‌నీసం 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై వుండాల‌ని, అందులోనూ తెలుగు స‌బ్జెక్టులో ఉత్తీర్ణులు కావ‌డంతో పాటు తెలుగులో వ్రాయ‌డం, చ‌ద‌వడం తెలిసి వుండాల‌ని పేర్కొన్నారు. అభ్య‌ర్ధుల వ‌య‌స్సు జూలై 1, 2023 నాటికి 21 నుంచి 35 సంవ‌త్స‌రాల మ‌ధ్య వుండాల‌ని తెలిపారు.
ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్ధులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి వుండాల‌ని పేర్కొన్నారు. రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్‌ను అనుస‌రించి సంబంధిత ఖాళీల‌కు కేటాయించిన కేట‌గిరీ అభ్య‌ర్ధులు మాత్ర‌మే ఆయా పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ల‌సి వుంటుందన్నారు. అర్హులైన ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్ధులు జూలై 22వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోగా సంబంధిత ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో త‌మ ద‌ర‌ఖాస్తులు అంద‌జేయాల‌న్నారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్