ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో(TTD) వార్షిక బడ్జెట్ రికార్డులు సృష్టించింది. 2023-24 సంవత్సరానికి రూ.4411 కోట్ల అంచనా వార్షిక బడ్జెట్ కి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. శ్రీవారి హుండీ ద్వారా రూ.1591 కోట్ల ఆదాయం అంచనా వేసింది. వడ్డీల ద్వారా రూ. 990 కోట్లు.. ప్రసాదం విక్రయం ద్వారా రూ.500 కోట్లు.. దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ. 330 కోట్లు టీటీడీ పాలక మండలి అంచనా వేసింది. కాగా, తిరుమలలో ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లు ఈరోజు విడుదల కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
Read Also: నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత
Follow us on: Youtube Instagram