ఆంధ్రప్రదేశ్ తీర్పు వైవిధ్యమైందని.. ఈ ఫలితాలను తాము ముందే ఊహించామని మంత్రి కొండా సురేఖ అన్నారు. కక్షపూరితమైన పాలనతోనే జగన్‌ను ఓటమిపాలయ్యారని విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడే ప్రజలు ఆయన్ను గెలిపించాలని నిర్ణయించుకున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమన్నారు. అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధిని కోరుకున్న జనం చంద్రబాబును గెలిపించారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కక్షపూరితంగా వ్యవహరించొద్దన్నారు.


