కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది బీజాపూర్ అటవీప్రాంతం. గురువారం నుంచి నాన్‌స్టాప్‌గా గన్ ఫైరింగ్ జరుగుతూనే ఉంది. గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా.. ఇవాళ కూడా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. శుక్రవారం కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఐజీ చెప్పారు. మరోవైపు బిమారంపాడు, తిమ్మిరాలలో పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. గురువారం ఎన్‌కౌంటర్ తర్వాత పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి కూంబింగ్ దళాలు. 1500ల మందికి పైగా జవాన్లు అడవులను జల్లెడ పడుతున్నారు.
రెండు రోజులుగా కాల్పుల మోతతో బీజాపూర్ అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ స్పాట్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక నారాయణ్‌పూర్‌లో మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.