స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలోని ప్రకాశంలో జిల్లాలో విష వాయువు లీక్ అయింది. ఈ ఘటనలో 16మంది కార్మికులు అస్వస్థతకి గురి కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో చేపల ప్రాసెసింగ్ సమయంలో అమ్మోనియం వాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో వాయువు పీల్చి అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఫ్యాక్టరీ ప్రతినిధి తెలిపారు.
కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఒంగోలు లోని రిమ్స్ లో చేర్పించినట్లు పేర్కొన్నారు. బాధిత కార్మికులంతా ఒరిస్సాకు చెందిన వారేనని తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు కూడా తెలియరాలేదు.. అయితే, బాధితులు అందరినీ ఎమర్జెన్సీ వార్డులో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో విష వాయువు లీక్..
Latest Articles
- Advertisement -