కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు. స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అంద జేశారు. శ్రీవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు అమిత్ షాకు వేదాశీర్వచనం అందిం చారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అమిత్ షా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కశ్మీర్ నుంచి తమిళనాడు వరకూ పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారం ముగియడంతో నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించున్నారు. నేటి మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.