Revanth Reddy | డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి సమానత్వం.. ఆయన ఆర్తి సామాజిక న్యాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ట్విట్టర్ వేదికగా.. ఆ మహనీయుడికి ఘననివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ రూపకర్త డా. బి.ఆర్. అంబెడ్కర్ అధికారికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజలంతా ఆయన ఆశయ సాధన దిశగా పయనించాలన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తోందని.. నిలువెత్తు విగ్రహం నిలదీస్తోందని అన్నారు. దళిత బిడ్డల కాలే కడుపుల సంగతేంటని? ప్రశ్నించారు. దళితుడే తొలి ముఖ్యమంత్రన్న ద్రోహి ఎవరని? మండిపడ్డారు. దళిత బిడ్డలకు మూడెకరాల భూమేది?దళిత బంధు వచ్చిందెవరికి? సబ్ ప్లాన్ నిధులు ఏ పద్దుల కింద మాయమైపోయాయి? సమాధానం చెప్పే దమ్ముందా కేసీఆర్? అంటూ విరుచుకుపడ్డారు.