మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు పెట్టిన పోస్టులపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో స్వయంగా హైకోర్టులో అంబటి రాంబాబు వాదనలు వినిపించనున్నారు.
అంబటి రాంబాబు పిటిషన్‌లో కీలక అంశాలు
మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తున్నారు. నాపైన , నా కుటుంబ సభ్యులపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల పైన పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చాను. నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే ప్రతిపక్ష నాయకులపై వెంటనే కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల పోలీసులు వివక్ష చూపిస్తున్నారు. నా ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించండి.. అని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అంబటి రాంబాబు కోరారు.