కొత్త ఏడాదిని అందరూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులను పరుగులు పెట్టించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రభుత్వం ఏపీ రాజధాని నిర్మాణంపై ఫోకస్ చేసింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే కీలక పనులను తలపెట్టింది. రాజధానిలో ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనులకు రూ.1206 కోట్లతో రెండు టెండర్లను ఆహ్వానించారు. రూ. 603 కోట్లు వ్యయంతో అమరావతి రాజధాని పరిధిలోని జోన్ -5 బీ పరిధిలో తుళ్లూరు, అబ్బరాజు పాలెం, బోరు పాలెం, దొండపాడు, రాయపూడి గ్రామాల్లో పనులు చేపడతారు. రహదార్లు, మురుగు నీటి కాల్వల నిర్మాణం, మంచినీటి సరఫరా, సీవరేజ్ పనులు, విద్యుత్, రెస్క్యూ వాటర్ లైన్ వంటి పనులు చేపట్టబోతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలెప్‌మెంట్ బ్యాంకు నిధులతో పనులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నెలలోనే రూ.30వేల కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఇప్పటికే సీఆర్డీఏ అథారిటీ కేబినెట్ ఆమోదం పొందింది. 2027 డిసెంబర్‌కు రాజధాని నిర్మాణం పూర్తయ్యేలా.. పక్కా ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది.