రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత రబీ సీజన్‌లో ధాన్యం విక్రయించిన రైతులకు మొత్తం రూ.674.47 కోట్ల బకాయిలను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ నిధులను విడుదల చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వం మొత్తం 84వేల 724 మంది రైతులకు లక్షా 674వేల 47 కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఏపీలో ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి.. రైతుల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యల పరిష్కారినికి అడుగులు వేస్తోంది. గత నెలలో 47వేల 350 మందికి వెయ్యి కోట్లు విడుదల చేసింది. తాజాగా మిగిలిన వారికి కూడా గత రబీ సీజన్ బకాయిలను చెల్లించనుంది. అమలాపురంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు.


