కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆయనకు టీపీసీసీ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రేపటి లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షోకాజ్ నోటీసులపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఏఐసీసీ నేత అయిన తనకు పీసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం ఎక్కడుందని ప్రశ్నించారు. పార్టీ మారాలని సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని తెలిపారు. పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడలేదన్నారు.
టీవీలో వార్తలు వస్తే వాటి ఆధారం వాటి ఆధారంగా షోకాజ్ నోటీస్ ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలు మారే వారు తనపై ఆరోపణలు చేస్తారా అని ఫైర్ అయ్యారు. ఆస్తులు అమ్ముకుని కాంగ్రెస్(Congress) కోసం పనిచేశానని పేర్కొన్నారు. మీకు ఇబ్బంది అయితే చెప్పండి పార్టీ నుంచి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు.. తనను పార్టీ నుంచి బయటకు పంపించడానికి కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుల్ని నేరుగా కలిసిన వారికి మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వరు కానీ ఏ తప్పు చేయని తనకు మాత్రం నోటీసులు ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: దారుణం… గోనె సంచిలో మృతదేహం
Follow us on: Youtube, Koo, Google News