స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర సర్వే శాఖకు చెందిన కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు తెలియజేస్తూ జులై 27న ప్రకటన జారీ చేసింది. గతేడాది అక్టోబరు 17న జారీ చేసిన నోటిఫికేషన్ 25/2022కు ద్వారా 8 కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలకు అదనంగా సాంకేతిక విద్యార్హతను చేర్చాలని తాజాగా నిర్ణయించడంతో ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అంతేకాకుండా విధుల నిర్వహణ జాబితాలోనూ మార్పులు చేశారు. వీటి వివరాలను నోటిఫికేషన్‌లో జతచేసి ఇవ్వాల్సి ఉన్నందున ఎపీపీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు అభ్యర్ధులు గ్రహించవల్సిందిగా కమిషన్ ప్రకటించింది.


