స్వతంత్ర వెబ్ డెస్క్: టెక్ కంపెనీల్లో గతేడాది మొదలైన కొలువుల కోతలు ఇటీవల కొంత నెమ్మదించాయి. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటుండగానే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్‌లకు తెరలేపింది. వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. పదివేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. అయితే, చెప్పినదానికంటే మరింత ఎక్కువ మందిపై వేటేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి వారంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రారంభం కానుందని నిన్న ప్రకటించింది. క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో డబ్బును ఆదా చేసుకునేందుకే లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు తెలిపింది. కాగా, అమెజాన్, గూగుల్, ట్విట్టర్ సహా పలు టెక్ కంపెనీలు ఇటీవల పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.