23.7 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

రెస్టారెంట్లలో కల్తీ ఆహారం …. అనారోగ్యాల పాలవుతున్న ప్రజలు

   హైదరాబాద్ బడా హోటళ్లలో కల్తీ ఫుడ్‌ బాగోతం తిండి ప్రియులను కలవరపెడుతోంది. వీకెండ్‌లు, పార్టీలు అంటూ పరుగెత్తుకెళ్లే జనాలను హడలెత్తిస్తోంది. లాభాల కోసం ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నాణ్యత లేని ఆహారంతో సొమ్ము చేసుకుంటున్న రెస్టారెంట్‌లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించడంతో అసలు విషయం బట్టబయలు అయింది.

   లాభాల వేటలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి హైదరాబాద్‌ రెస్టారెంట్లు. బ్రాండ్‌ పేరు చెప్పుకుని కల్తీఫుడ్‌తో దండిగా దండుకుంటూ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టు కల్తీ దందా సాగిస్తున్నారు. ఒక్కసారి జనాల్లో క్లిక్‌ అయితే చాలు ఇక ఆ పేరు మాటున రుచి, శుచీ లేని ఆహారాన్ని అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే, ఫుడ్‌ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులతో ఈ కల్తీ బాగో తం బయటపడంతో నగరవాసులు హోటళ్లకు వెళ్లాలంటే బెంబెలెత్తిపోతున్నారు. ఈ తనిఖీల్లో దిమ్మతి రిగే విషయాలు తెలుస్తుండటంతో హడలెత్తిపోతున్నారు.

  హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్​లు, పబ్​లలో తనిఖీలు చేశారు. సోమాజి గూడలోని కృతుంగా, హెడ్‌ క్వార్టర్స్‌లోని రెస్ట్‌ ఓ బార్‌, కేఎఫ్‌సీలో సోదాలు జరిపారు. తనిఖీల్లో నాణ్యతలేని ఆహారాన్ని గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్‌లు, పురుగుపట్టి పాడైపోయి, కాలం చెల్లిన వంట పదార్థాలు, రెండు మూడు రోజులుగా నిల్వ ఉంచిన మాంసాన్ని వాడుతున్నట్టు గుర్తించారు. కృతుంగాలో నాణ్యత లేని 6 కిలోల పన్నీర్, కాలం చెల్లిన 6 కిలోల మేతి మలై పేస్ట్, టీడీఎస్ 4 పీపీఎం ఉన్న 156 వాటర్ బాటిల్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్ లో ఎలాంటి లేబుల్స్ లేని వస్తువులను, సింథటిక్ కలర్లను వాడుతున్నట్టు గుర్తించారు. అలాగే కేఎఫ్ సీలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ డిస్ ప్లే చేయడం లేదని గుర్తించారు. ఫుడ్‌ సేఫ్టీ నిబంధ నలను గాలికి వదిలేసిన ఈ హోటళ్లపై కేసు నమోదు చేశారు.

  ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. మరి ఇలాంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య పరిస్థితులు దరిచేరే అవకాశముంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై ప్రాణాలే కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయి. కల్తీ వల్ల విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్‌ ఉంది. అలాగే మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వీకెండ్లు, ఈవెంట్‌లు, పార్టీలంటూ బయట తిండికి అలవాటు కావొద్దని, వీలైనంత వరకూ బయట తిండికి దూరంగా ఉంటే, కల్తీ ఫుడ్‌ని అవాయిడ్‌ చేసినట్టేనని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇకనైనా ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతు న్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్