Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

టానిక్ దుకాణం అసలు బాగోతం బహిర్గతం

   టానిక్ వైన్ షాప్ నిర్వాహకుల బాగోతం బయటపడుతోంది. రాష్ట్రంలో ఏ లిక్కర్ షాప్ నకు లేని వెసులబాటు కేవలం టానిక్ వైన్ షాప్ కు మాత్రమే ఎందుకిచ్చారనే ప్రశ్నలు తలెత్తుతునాయి. గత ప్రభుత్వ హయాంలో పదవులను అడ్డం పెట్టుకొని పలువురు ఇష్టానుసారంగా టానిక్ కు అనుమతులు జారీ చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా షాపులు ఉంటే ఒక్క టానిక్ కు మాత్రమే ఎందుకు అనుమతులు లభించాయి? అసలు టానిక్ వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు.? టానిక్ నిర్వాహకులు ఉల్లంఘిస్తున్న నిబంధనలేంటి ?

   జూబ్లీహిల్స్ లోని టానిక్ షాప్ సిటీలోనే అతిపెద్ద లిక్కర్ మార్ట్. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే ఈ టానిక్ దుకాణం అసలు బాగోతం బహిర్గతమైంది. గత ప్రభుత్వ హయాంలోని కొందరు పెద్దలు టానిక్ కు ఎన్నో వెసులుబాట్లు కలిపించారు. కొందరి నేతల అండదండలు చూసుకున్న టానిక్ నిర్వాహకులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ లు సైతం ఎగ్గొట్టారు. ఆరు సంవత్సరాల్లో దాదాపు 100 కోట్ల రూపాయల ట్యాక్స్ ను టానిక్ యాజమాన్యం చెల్లించాల్సి ఉన్నట్టు తెలిసింది. అయితే, ఈ కంపెనీ ట్యాక్స్ ఎగవేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టింది. మద్యం అమ్మకాలపై ఎలైట్ అవుట్ లెట్ లైసెన్స్ పొందిన ఏకైక సంస్థ గా టానిక్ నిలిచింది .టానిక్ కోసం గత ప్రభుత్వం ప్రత్యేకించి ఒక జీవోను తీసుకొచ్చింది. ఈ జీఓ ను అడ్డం పెట్టుకొని ఒక రూపాయి సైతం టాక్స్ చెల్లించకుండా ఈ కంపెనీ తన కార్యకలాపాలను యధేచ్ఛగా కొనసాగిస్తోంది.

     2016లో గత ప్రభుత్వం కేవలం టానిక్ కోసం జీవో నెంబర్ 271 ను తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా టానిక్ అవుట్ లెట్ కు పర్మనెంట్ లైసెన్సు జారీ చేసింది. సాధారణంగా ప్రతి ఏటా నాలుగు లైసెన్స్ పొందిన షాప్ లకు పరిమితి కేవలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక అనుమతుల ద్వారా ఎలైట్ కేటగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్క టానిక్ కు మాత్రమే ఈ లైసెన్స్ మంజూరు అయింది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలెక్ట్ లైసెన్స్ ను పొందిన టానిక్ యాజమాన్యం దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే, యాజమాన్యం దాన్ని రెన్యువల్ చేసుకుంటే చాలు అన్నట్టుగా జీవో విడుదలైంది. ఎలైట్ అమ్మకాలకు సంబంధించి 2016లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ బహిర్గతమై ఉంటే టానిక్ తో పాటు ఎలైట్ లైసెన్స్ ల కోసం చాలా మద్యం షాపులు పోటీపడేవి. అయితే, నోటిఫికేషన్ ను కేవలం టానిక్ నిర్వాహకులకే తెలిసేలా గోప్యత పాటిస్తూ దాని నిర్వాహకులకు లాభం చేకూర్చేలా గత ప్రభుత్వ అధికారులు వ్యవహరించినట్టు తెలుస్తోంది,

    ఎలైట్ అనుమతులు పొందిన టానిక్ అవుట్ లెట్ కు లాభాలు చేకూర్చేలా అప్పటి అధికారులు వ్యవహరించినట్టు రూఢి కావడంతో.. ప్రస్తుత ఎక్సైజ్ అధికారులు ఆ ఆధారాలను సేకరిస్తున్నారు. అసలు ఎలైట్ అవుట్ లైట్స్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన జీవో ప్రామాణికతను అధికారులు పరిశీలిస్తున్నారు. 2016లో తీసుకొచ్చిన ఈ జీవో ద్వారా రాష్ట్రంలోని ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు ఒక్క టానిక్ అవుట్లైట్ కు మాత్రమే లభించింది. ఇందుకోసం ప్రతి సంవత్సరం కోటి 25 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే సాధారణ ఏ ఫోర్ లైసెన్స్ ఉన్న షాపులకు మాత్రం కోటి 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. వీటి పరిమితి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. వీటన్నిటికీ భిన్నంగా ఎలైట్ లైసెన్స్ పొందిన టానిక్ నిర్వాహకులు అందరితో పోలిస్తే ఐదు లక్షలు కడితే చాలు తమ ఇష్టానుసారంగా మద్యం విక్రయాలు జరిపేలా జీవోను తీసుకొచ్చారు. సాదరంగా షాప్ ల ఉన్న స్టాక్ అంటే ఎక్కువ విక్రయాలు జరిపితే లైసెన్స్ ఫీజుకు పదింతలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎలైట్ లైసెన్స్ పొందిన టానిక్ షాప్ కు మాత్రం అలాంటి నిబంధనలు ఏవి వర్తించకుండా చేశారు. లైసెన్స్ పొందిన నాటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదంటూ జీవోలో పేర్కొన్నారు. మరోవైపు ప్రతి షాపు రాత్రి 11 గంటల వరకు మూసివేయాల్సి ఉంటుంది. అయితే, ఎలైట్ అనుమతులు పొందిన టానిక్ షాప్ మాత్రం అర్ధరాత్రి రెండు గంటల వరకు తెచ్చుకుంది. ఈ విషయంపై తాజాగా విచారణ జరిపిన ఎక్సైజ్ అధికారులు అర్ధరాత్రి రెండు గంటల వరకు షాప్ తెరుచుకునే నిబంధనను టానిక్ షాప్ నకు తొలగించారు. అన్ని షాపుల రీతిలోనే రాత్రి 11 గంటల వరకు మాత్రమే టానిక్ షాప్ లో మద్యం విక్రయాలు జరపాల్సి ఉందన్నారు.

     సాధారణంగా ఏదైనా మద్యం దుకాణంలో విదేశీ మద్యం అమ్మాలంటే ఖచ్చితంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే విదేశీ మద్యం అమ్మకాలకు సంబంధించి కేవలం టానిక్ మెయిన్ బ్రాంచ్ గా ఉన్న జూబ్లీహిల్స్ లో మాత్రమే ఆ అనుమతి ఉంది. ఇదే క్రమంలో సిటీలోని పలు ప్రాంతాల్లో క్యూ బై టానిక్ పేరుతో కొన్ని ఫ్రాంచైజీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్రాంచైజీలలో సాధారణ మద్యం అమ్మకానికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. అసలు ఒకే పేరు మీద ఇన్ని లిక్కర్ షాపులు కలిగి ఉండటం చట్టపరంగా విరుద్ధమనే అంశాన్ని అధికారులు గుర్తించారు. గత ఆరేళ్లుగా టానిక్ ఎలాంటి టాక్స్ కట్టకున్నా ఉన్నా వీరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టానిక్ మెయిన్ బ్రాంచ్ లో విదేశీ మద్యం అమ్మకానికి సంబంధించి అందులో పని చేసే ఒక కార్మికుడు లైసెన్స్ తీసుకొచ్చాడు. దానికి లైసెన్స్ తీసుకొచ్చిన వ్యక్తులు కాకుండా ఇతర వ్యక్తులు ఇందులో వ్యాపార భాగస్వాములుగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఆ వ్యాపారుల వెనుక కొందరు కీలక రాజకీయ నేతలు ఉన్నట్టు విచారణలో బయటపడింది.

    టానిక్ నిర్వాహకుల బాగోతాలు ఒక్కొక్కటిగాబయటపడుతున్నాయి. ఎలైట్ అనుమతుల పేరుతో జారీ చేసిన జీవోతో పాటు అందుకు కారణమైన వ్యక్తులపై శాఖా పరంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే టానిక్ పై ఒక వైపు జిఎస్టి తో పాటు మరోవైపు ఎక్సైజ్ అధికారుల ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్నారు. గత మూడు రోజుల నుండి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టానిక్ అనుమతులపై త్వరలోనే ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్