23.7 C
Hyderabad
Saturday, March 21, 2026
spot_img

మరో మైలురాయిని అధిగమించిన ఆదిత్య ఎల్1..

స్వతంత్ర వెబ్ డెస్క్: సూర్యుడి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మొదటిసారిగా ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్‌1’ ఉపగ్రహం.. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మరో కీలక మైలురాయిని అందుకుంది. ఈ వ్యోమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించినట్టు ఇస్రో తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని అది విజయవంతంగా దాటినట్లు తెలిపింది. సెప్టెంబరు 2న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ప్రస్తుతం లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌-1) దిశగా పయనిస్తున్నట్లు పేర్కొంది. భూమి నుంచి సూర్యుడి దిశగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భానుడిపై నిరంతర పరిశీలనలకు ఆ ప్రాంతం అనువైంది.

కాగా, ఇస్రో ప్రయోగించిన అంతరిక్ష నౌక భూ గురుత్వాకర్షణ ప్రభావం దాటి వెళ్లడం ఇది రెండోసారి. గతంలో అంగారకుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్‌‌ మొదటిసారి భూ గురుత్వాకర్షణ ప్రభావం దాటి పయనించింది. కాగా, ఆదిత్య ఎల్1 సూర్యుడ్ని ముఖ్యంగా ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాలను అధ్యయనం చేయనుంది. ఇందులోని మొత్తం ఏడు పేలోడ్లను స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. వీటిలో ఐదు పేలోడ్‌లను ఇస్రో, మరో రెండు దేశంలోని విద్యా సంస్థల సహకారంతో రూపొందించింది.

మొత్తం ఈ 7 పరిశోధన పేలోడ్‌లు సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనాను కూడా అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి.

లిబ్రేషన్ పాయింట్లు అని కూడా పిలిచే లాగ్రాంజ్ పాయింట్లు అంతరిక్షంలో ప్రత్యేకమైన ప్రదేశాలు. ఈ ప్రదేశంలో భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ వంటి వస్తువులు కదలడానికి అనుకూలమైన ప్రదేశం. అంతరిక్ష నౌకలు కక్ష్యలో తిరగడానికి ఒక అద్భుతమైన ప్రదేశంగా మార్చుతుంది. అందువల్ల కక్ష్యను నిర్వహించడానికి అవసరమైన ఇంధన చాలా తక్కువ ఖర్చవుతుంది.

ఇక, సెప్టెంబరు 2న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1.. 125 రోజులు ప్రయాణం తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుతుంది. ప్రయోగం తర్వాత 16 రోజుల పాటు భూకక్ష్యలో ఉన్న ఈ ఉపగ్రహం.. ఐదు దశల్లో కక్ష్య పెంపు విన్యాసాన్ని నిర్వహించిన తర్వాత నిర్దేశిత లాగ్రాంజ్ పాయింట్ 1 వైపు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్