స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రభాస్ ఆదిపురుష్(Adipurush) మూవీ సెలైంట్‌గా ఓటీటీలోకి (OTT)వచ్చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రమోషన్స్ లేకుండా గురువారం మిడ్‌నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో( Amazon Prime) ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిపురుష్ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌తో ఉండటంతో పాటు అదనంగా 279 రూపాయలు చెల్లించాలి. వచ్చే వారం నుంచి ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు ముందు ఆదిపురుష్‌పై నెలకొన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్‌ను(Digital Rights) దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది.
రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా జానకిగా కృతిసనన్ కనిపించింది. రావణుడి క్యారెక్టర్‌ను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పోషించాడు. వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలతో జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ ఏడాది నిర్మాతలకు అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 350 కోట్లలోపే వసూళ్లను రాబట్టింది. తెలిసిన కథ కావడం, విజువల్ ఎఫెక్ట్స్ , రావణాసురుడుతో పాటు పలు పాత్రల లుక్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. రామాయణాన్ని వక్రీకరించారంటూ, కార్టూన్ సినిమాల తీసి మనోభావాలు దెబ్బతీశారంటూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్ యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌పై భారీగా పడింది. తొలిరోజు 140కు పైగా వసూళ్లను రాబట్టిన నెగెటివ్ టాక్ కారణంగా ఆ జోరును కంటిన్యూ చేయలేకపోయింది.