స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలో గవర్నర్ల వ్యవస్థపై అసహనం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. అసలు ఈ గవర్నర్ల వ్యవస్థేంది.? బడ్జెట్‌ను పాస్ కానివ్వనని గవర్నర్ అంటే ఎలా.? సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకోవాల్సిన దుస్థితి ఉందంటూ మండిపడ్డారు. ఇంత దౌర్భగ్యపరిస్థితి ఎక్కడైనా ఉంటదా.? అంటూ వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవి అనేది అలంకారప్రాయమైన పదవి. కర్నాటకలో కర్రుకాల్చి వాత పెట్టినా కేంద్రం మారకపోతే ఎలా.? అంటూ అధికార బీజేపీని ప్రశ్నించారు.