28.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

యంగ్ హీరోతో ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్‌- కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడైన తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతి రామయ్య నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. నిశ్చితార్థం అనంతరం ఐశ్వర్య, ఉమాపతిల వివాహం 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని అర్జున్ సర్జా తెలిపారు. ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, బంధువులను మాత్రమే పిలిచామని.. పెళ్లికి మాత్రం అందరినీ ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా అర్జున్ సర్జా మీడియాకు తెలియజేశారు.

ఈ నిశ్చితార్థ వేడుకలో ఉమాపతి రామయ్య డ్రస్‌ని ముంబైకి చెందిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా.. ఐశ్వర్య అర్జున్ ధరించిన డ్రస్‌ను జయంతి రెడ్డి డిజైన్ చేశారు. 5 క్యారెట్ బర్మీస్ రూబీ విత్ డైమండ్ అండ్ వైట్ గోల్డ్‌తో చేసిన రింగ్స్‌ని ఐశ్వర్య అర్జున్ ధరించగా.. ఉమాపతి కూడా గోల్డ్ అండ్ డైమండ్ రూబీ ధరించారు. అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లోని రాములువారి విగ్రహం ముందు ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నట్లుగా అర్జున్ సర్జా చెప్పుకొచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్