హైదరాబాద్ నాంపల్లి లోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నీటిపారుదల శాఖకు చెందిన నలుగురు అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్ రూ.లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే సమయంలో, లంచం డిమాండ్‌కు సంబంధించి కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగించారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు. వారిని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ వలలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ తో పాటు మరో ఇద్దరు ఏఈలు ఉన్నారు. నాలుగో వ్యక్తి కోసం రాత్రి నాలుగు గంటల పాటు శ్రమించి పట్టుకున్నారు.


