స్వతంత్ర, వెబ్ డెస్క్: అనకాపల్లి, జిల్లా అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో యువతీ యువకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. వీరిద్దరూ పాయిజన్ సేవించి సూసైడ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యువకుడిని వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.