30.3 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

మతవిద్వేషం రెచ్చగొట్టే వీడియో

2024 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, నకిలీ వీడియోలు తయారుచేసే వారిపట్ల ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని సిఈసీ రాజీవ్ కుమార్ ప్రకటిం చారు. కానీ, కఠిన చర్యలు తీసుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ తన ఎక్స్ లో ముస్లిం లను కించపరచే విధంగా కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యంగ్య చిత్రాలను చూపించే వీడియోను అప్ లోడ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకమిషన్ కు ఫిర్యాదు చేసి 48 గంటలుముగిసినా, ఎన్నికల కమిషన్ స్పందించలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ముస్లింలకు సంపద దోచి పెడుతుందన్న విధంగా ఈ వీడియో చిత్రీక రించారు. ఎన్నికల వేళ మతపరమైన విద్వేషం రెచ్చగొట్టే విధంగానే ఈ వీడియో ఉంది. హెచ్చరిక అని కన్నడ భాషలో శీర్షిక కూడా ఇచ్చారు.

ఒక పక్షి గూడులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనే మూడు గుడ్లుతో ముస్లీమ్స్ అనే మరో గుడ్డును చేర్చి.. గుడ్లు పొదిగిన తర్వాత ముస్లిమ్స్ అనే గుడ్డునుంచి వచ్చిన పిల్లకు నిధులు ధారపోసినట్లు చిత్రీకరించారు. తర్వాత మిగతా పిల్లలను విసిరి వేసినట్లు చూపారు. వీడియోలో రాహుల్ గాంధీ, సిద్దరామయ్య కేరికే చర్ను చూపారు. కర్ణాటక కాంగ్రెస్ మీడియా, కమ్యునికేషన్ చైర్మన్ రమేశ్ బాబు బీజేపీ జాతీయ అధ్య క్షుడు జెపి నడ్డా, బీజేపీ ఐటీ సెల్ ఇన్ చార్జి అమిత్ మాలవీయ, రాష్ట్ర ప్రెసిడెంట్ బివై విజయేంద్ర , కర్ణాటక బిజేపీ సోషల్ మీడియా ఇన్ చార్జి పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయినా.. భారత ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్