స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖపట్టణం(Vishakapattanam) నగరంలోని గోపాలపురంలో బేబీ సినిమా(Baby Movie) తరహా ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది. ఒకరిని వివాహం చేసుకున్న తర్వాత మరొకరితో ప్రేమ వ్యవహరం(Love) నడిపింది. అయితే ఈ విషయం ఇద్దరు యువకులకు తెలియడంతో యువతిని నిలదీశారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ప్రియుడు సూర్యప్రకాష్(Surya Prakash) కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ చదువుకునే యువతి మైనర్. ఆమె తొలుత సాయి అనే యువకుడిని ప్రేమించింది. సాయి(Sai) అనే యువకుడు ఆ యువతికి తాళి కట్టాడు. ఈ విషయమై ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో(Social Media) వైరల్ గా మారింది. సాయిని వివాహం చేసుకున్న తర్వాత సూర్య ప్రకాష్ అనే యువకుడితో యువతి ప్రేమాయణం సాగించింది. అయితే తాళి కట్టిన సాయి కంటే సూర్యప్రకాష్ కు యువతి మరింత దగ్గరైంది. ఈ విషయం ఈ ఇద్దరు యువకులకు తెలిసింది. ఈ ఇద్దరు ఒకేసారి యువతి ఇంటికి వచ్చి యువతిని నిలదీశారు. దీంతో యువతి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు యువతి ఓ లేఖ రాసింది. తన చావుకు కారణమైన ఎవరిని వదలవద్దని యువతి ఆ లేఖలో కోరింది.
యువతి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో యువతి ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగు చూసింది. ఈ విషయమై విచారణ సమయంలో సాయి, సూర్యప్రకాష్ లను పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. విచారణ ముగిసిన తర్వాత సూర్యప్రకాష్ రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. యువతి ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.