జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు తెగబ డ్డారు. రియాసీ జిల్లాలోని శివ్ ఖోడీ ఆలయాన్ని సందర్శించుకున్న యాత్రికులు కాట్రాకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం పోని ప్రాంతంలోని తెర్యాత్ గామ్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సులోయలో పడిపోయింది. ఈ ఘటన లో పదిమంది యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 33 మంది గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రోన్ సహాయంతో భద్రతా దళాల గాలిస్తున్నారు. లోయలో నుంచి బస్సును తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తోంది. పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షించారు. దాడికి బాధ్యు లైన వారిని విడిచిపెట్టేది లేదని అమిత్‌షా హెచ్చరించారు. ప్రధాని మోదీ, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో, పలు దేశాల అధిపతులు వచ్చిన సందర్భంలో ఈ దాడి జరగడం దారుణమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో శాంతిభద్రతలు ఆందోళనకర రీతిలో ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.


